ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో నూతన మద్యం పాలసీ విధానం బట్టి బుధవారం నుంచి రాష్ట్రంలో మద్యం దుకాణాలు ప్రైవేటు మద్యం దుకాణాలుగా అవతరించడంతో అమ్మకాలు ప్రారంభమయ్యాయి. బుధవారం ఆముదాలవలస పట్టణంలోని కృష్ణాపురం సమీపంలో 34 నెంబర్ ప్రైవేటు మద్యం దుకాణం అమ్మకాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా కొనుగోలుదారులు అధికంగా దుకాణం వద్దకు చేరడంతో రద్దీ ఏర్పడింది.