ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరోసారి మీడియా ముందుకు దువ్వాడ శ్రీనివాస్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 07, 2024, 05:22 PM

శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం వైసీపీ మాజీ ఇన్‌ఛార్జ్, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ చాలారోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చారు. తన ప్రియురాలు మాధురితో కలిసి మీడియాకు ఫోజులిచ్చారు. కొద్దిరోజులుగా తన భార్యతో వివాదం కారణంగా దువ్వాడ శ్రీనివాస్ చాలా సైలెంట్ అయిపోయారు. దువ్వాడ శ్రీనివాస్ తనకు దూరంగా ఉంటూ మరో మహిళతో ఉంటున్నారని ఆయన భార్య ఆరోపించారు. ఈ అంశంపై కొంత వివాదం నడిచింది. ఇదే సమయంలో ఆస్తుల పంపకానికి సంబంధించిన వివాదం దువ్వాడ శ్రీనివాస్‌ను వెంటాడింది. సుమారు నెల రోజుల తర్వాత మళ్లీ తన ప్రియురాలు మాధురితో కలిసి దువ్వాడ శ్రీనివాస్ తిరుమల కొండపై కనిపించారు. ఉదయం బ్రేక్ దర్శనం సమయంలో మాధురితో కలిసి దువ్వాడ శ్రీనివాస్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం వారిద్దరూ మీడియాకు ఫోజులిచ్చారు. తన భార్యతో వివాదం కారణంగా వైసీపీ టెక్కలి ఇన్‌ఛార్జ్ పదవి నుంచి దువ్వాడను తప్పించింది. ఆయన తీరుతో పార్టీకి నష్టం వాటిల్లుతుందనే ఉద్దేశంతో దువ్వాడను వైసీపీ పక్కనపెట్టింది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com