ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 03, 2024, 12:27 PM

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు గురువారం అంకురార్పణ జరగనుంది. దీనిలో భాగంగా ఈరోజు సాయంత్రం ఆలయంలో సేనాధిపతిని సుందరంగా అలంకరించి విశేష సమర్పణ కావిస్తారు. అనంతరం రాత్రి 7 గంటలకు మాడవీధులగుండా ఊరేగింపు నిర్వహిస్తా రు. తర్వాత రంగనాయక మండపంలో ఆస్థానం నిర్వహిస్తారు. యాగశాలలో అర్చకస్వాములు కైంకర్యాలు నిర్వహించి అంకురార్పణ(బీజవాపం) నిర్వహిస్తా రు. దీంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు మొదలవుతాయి. ఇక, శుక్రవారం సాయంత్రం 5.45 నుంచి 6 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణం, రాత్రి పెద్దశేషవాహనాలతో వాహన సేవలు ప్రారంభంకానున్నాయి. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు కంకణ భట్టాచార్యులుగా గోవిందాచార్యులు వ్యవహరిస్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com