ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయసాయిరెడ్డిపై మండిపడ్డ సోమిరెడ్డి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 23, 2024, 06:53 PM

 దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుంచి మాజీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి వరకు టీటీడీ అంటే దోచుకునే బ్రాంచ్‌గా చూశారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. జగన్ ప్రభుత్వంలో వ్యవస్థలను నాశనం చేశారని విమర్శించారు. టీటీడీని వైసీపీ ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. పింక్ డైమండ్ అంటూ వైసీపీ నేత విజయసాయిరెడ్డి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 


విజయసాయిరెడ్డి ట్వీట్లు చూస్తుంటే కడుపు మండిపోతుందని అన్నారు. సీఎం చంద్రబాబును విజయసాయిరెడ్డి నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే చూస్తూ కూర్చోలేమని వార్నింగ్ ఇచ్చారు. విజయసాయిరెడ్డి చంద్రబాబును విమర్శిస్తుంటే ఏపీ డీజీపీ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పింక్ డైమండ్ విషయం ఏంటో చెప్పకపోతే విజయసాయిరెడ్డిని బొక్కలో వేయాలని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హెచ్చరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com