ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రామసముద్రంలో వీధి కుక్కల బెడద

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 27, 2024, 04:17 PM

రామసముద్రం మండలంలో వీధి కుక్కలు స్వైర విహారంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఏ రోడ్డులో చూసిన కుక్కలు గుంపులు గుంపులుగా దర్శనమిస్తున్నాయి. పాఠశాలలకు వెళ్ళే చిన్నారులు వీటి వలన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రిపూట ద్విచక్ర వాహనదారుల వెంటపడి మరీ ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. రాత్రి సమయాలలో వీటి ఆగడాలకు హద్దు, ఆదుపు లేకుండా పోతున్నాయన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వీధి కుక్కల బారి నుంచి ప్రజలను కాపాడాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com