ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సెప్టెంబర్ 2న మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన జనసేన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 26, 2024, 10:22 PM

గత కొన్నేళ్లుగా తన పుట్టినరోజు వేడుకలను సామాజిక కార్యక్రమాలతో పవన్ కళ్యాణ్ జరుపుకుంటున్నారు. రక్తదానం, ఆసుపత్రులు, పాఠశాలల్లో శ్రమదానం, పేద ప్రజలకు చేయూత వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా తన పుట్టినరోజు వేడుకలు నిర్వహించాలని అభిమానులకు పవన్ పిలుపునిచ్చారు. తాజాగా ఈ ఏడాది పవన్ బర్త్‌డే సందర్భంగా మొక్కలు నాటాలని జనసేన పార్టీ పిలుపునిచ్చింది. అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కావడంతో పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటాలని ఆ పార్టీ పిలుపునిచ్చింది. ఇంకేముంది ఇప్పటినుంచే పవన్ ఫ్యాన్స్ ఆ పనుల్లో నిమగ్నమైపోయారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com