ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అందుబాటులోకి టమాటా ధరలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 24, 2024, 07:31 PM

ఆకాశాన్ని తాకిన టమాటా ధరలు ఇప్పుడు దిగివస్తున్నాయి. కర్నూల్ మార్కెట్ యార్డులో కిలో టమాటా రూ.20 పలుకుతోంది. అయితే ఈ ధరలపట్ల వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నా.. రైతులు మాత్రం లబోదిబోమంటున్నారు. తగ్గిన ధరలతో కనీసం పెట్టుబడి కూడా తిరిగి రావట్లేదని వాపోతున్నారు. మార్కెట్‌లో కిలో టమాటా రూ.20 నుంచి రూ.25 పలుకుతుండగా, రైతులకు కిలో రూ.4 నుంచి రూ.5 మాత్రమే వస్తోంది. పత్తికొండ మార్కెట్‌లో12 కిలోల టమోటాలు కేవలం రూ. 50కే విక్రయిస్తున్నారు. అంటే ఆ లెక్కన కిలో టమాట రూ. 4 పడుతుందనమాట. పత్తికొండ మార్కెట్‌కు 2 వేల 500 నుంచి 3వేల బాక్సుల టమోటాలు వస్తున్నాయి. ఉదాహరణకు రెండు 25 కేజీల బాక్సులు రూ.250 నుంచి రూ.300 వరకు ధర పలుకుతున్నాయి. అంటే గిట్టుబాటు కూడా రావట్లేదనమాట. ఈ సీజన్‌లో టమోటా సాగు చేసే ప్రాంతం బాగా తగ్గిపోయింది. కర్నూలు జిల్లాలో టమాటా సాగు విస్తీర్ణం 2 వేల 600 హెక్టార్ల నుంచి 1,450 హెక్టార్లకు పడిపోయింది. నంద్యాల జిల్లాలోనూ గతేడాది 2 వేల 310 హెక్టార్లలో సాగు చేయగా, ఈ ఏడాది 2 వేల 050 హెక్టార్లకు తగ్గింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com