ప్రభుత్వ ఆసుపత్రులలో పనిచేస్తున్న కాంట్రాక్టు సిబ్బందికి తక్షణమే బకాయి జీతాలు చెల్లించాలని ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ డిమాండ్ చేశారు. నెల్లిమర్ల సామాజిక ఆరోగ్య కేంద్రం వద్ద మంగళవారం ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ సిబ్బందికి బకాయి ఉన్న ఐదు నెలలు జీతం తక్షణమే చెల్లించాలని కోరారు. 2021 నుంచి రావాల్సిన పిఎఫ్ బకాయిలు మొత్తం చెల్లించాలని డిమాండ్ చేశారు.