ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజాప్రభుత్వం ఏర్పాటయ్యాక జరుగుతున్న ఈ స్వాతంత్ర్య వేడుకల్లో ప్రజలందరి కళ్లల్లో ఆనందం కనబడుతోంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 15, 2024, 08:26 PM

రాష్ట్రంలో చంద్రబాబునాయుడు గారి నేతృత్వాన ప్రజాప్రభుత్వం ఏర్పాటయ్యాక జరుగుతున్న ఈ స్వాతంత్ర్య వేడుకల్లో ప్రజలందరి కళ్లల్లో ఆనందం కనబడుతోందని, ఇచ్చిన మాట ప్రకారం సూపర్ – 6 హామీల అమలుకు కట్టుబడి ఉన్నామని విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టంచేశారు. 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గుంటూరు పోలీసు పెరేడ్ గ్రౌండ్స్ లో మంత్రి లోకేష్ పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. జాతీయ జెండాను ఆవిష్కరించారు. జిల్లా యంత్రాంగం తయారుచేసిన అభివృద్ధి శకటాలను వీక్షించి, ఉత్తమ శకటాలకు అవార్డులు అందజేశారు. స్వాతంత్ర వేడుకల సందర్భంగా ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. ప్రాంగణంలో ఏర్పాటుచేసిన స్టాళ్లను పరిశీలించి, ఉత్తమ స్టాళ్లకు అవార్డులు అందించారు. జిల్లాలో ఉత్తమ సేవలందించిన అధికారులకు అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలనుద్దేశించి మంత్రి లోకేష్ మాట్లాడారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com