ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నెల్లిమర్ల జూట్‌ మిల్లు సమస్యపై స్పందించిన ఎమ్మెల్యే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 15, 2024, 04:20 PM

నెల్లిమర్ల జూట్‌ మిల్లు సమస్య పరిష్కారానికి కృషిచేస్తానని ఎమ్మెల్యే లోకం నాగమాధవి తెలిపారు. బుధవారం నగర పంచాయతీ పరిధిలోని జరజాపుపేటలో నల్లి రాజు, నల్లి సాయి సోదరులు మెగాస్టార్‌ చిరంజీవి జన్మదినం పురస్కరించుకుని రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నెల్లిమర్ల జూట్‌ మిల్లు సమస్య తన దృష్టికి వచ్చిందని, మిల్లు యాజమాన్యంతో మాట్లాడినట్లు తెలిపారు. శిబిరంలో 50 మంది యువకులు రక్తదానం చేశారు.కాగా గ్రామంలో కిల్లంపల్లి రామారావుతో పాటు పలువురు నుంచి వినతులు స్వీకరించారు. కార్యక్రమంలో జనసేన గల్ఫ్‌ దేశాల సమన్వయ కర్త చందక రామదాసు, రత్నం, నగర పంచాయతీ చైర్‌పర్సన్‌ బంగారు సరోజిని, జనసేన నాయకులు ఎంఎం నాయుడు, నల్లి శేఖర్‌, ఎం.అప్పన్న, తుమ్ము వెంకటరమణ, టీడీపీ నాయకులు కడగల ఆనంద్‌కుమార్‌, అవనాపు సత్యనారాయణ కింతాడ కళావతి పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com