ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రోడ్డు ప్రమాదంలో యువకునికి తీవ్ర గాయాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 15, 2024, 04:19 PM

కడప జిల్లా, కలికిరి పట్టణంలోని యల్లమ్మ ఆలయం వద్ద ఆర్టీసీ బస్సు, ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ఈశ్వరయ్య (21)అనే యువకుడు తీవ్ర గాయాలకు గుర య్యాడు. బుధవారం జరిగిన ఈ సంఘటనకు సంబందించిన వివరాలు.. సోమల నుంచి కలికిరి వస్తున్న ఆర్టీసీ బస్సు ఒక ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. కలికిరి నుంచి గుట్టపాలెం పంచాయతీ సి.బరిణేపల్లెకు చెందిన ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనంలో స్వగ్రామం వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనం వెనుక కూర్చున్న ఈశ్వరయ్య బస్సు కింద పడిపోవడం తో ఒక కాలు పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. వాహనం నడుపుతున్న మరో యువకుడు రాజేష్‌కు కూడా గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన ఈశ్వరయ్యకు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేయిం చిన అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు. కలికిరి సీఐ ఆదేశాల మేరకు గాయపడ్డ రాజేష్‌ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఏఎస్‌ఐ మధుసూ దనాచారి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com