భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ శనివారం మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జుతో భేటీ అయ్యారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం జైశంకర్ నిన్న మాల్దీవులకు వెళ్లారు. తన పర్యటనలో రెండో రోజైన శనివారం ఆ దేశ అధ్యక్షుడితో సమావేశమయ్యారు. వీరిద్దరు పలు అంశాలపై చర్చించుకున్నారు. ఇరుదేశాల మధ్య సత్సంబంధాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. రేపటి వరకు మాల్దీవుల్లోనే ఉండనున్న జైశంకర్ ద్వైపాక్షిక అంశాలపై చర్చించనున్నారు.