ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 05, 2024, 02:42 PM

విజయవాడ, వెటర్నరీ కాలనీలోని వీఎంసీ పార్క్ లో నూతనంగా నిర్మించిన జిమ్ ను మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. వెటర్నరీ కాలనీ వాసులు జిమ్ కోసం సొంతంగా డబ్బు సమకూర్చారన్నారు. వీఎంసీ ఆధ్వర్యంలో ఈ పార్కు నిర్వహణ జరుగుతుందన్నారు. గ్రీన్ డెవలప్మెంట్, పర్యావరణంపై సీఎం చంద్రబాబుతో చర్చించానని తెలిపారు. కాలనీల్లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉండేలా చేస్తామన్నారు. ఈ ప్రాంతంలో కొన్ని సమస్యలు తనకు చెప్పారని..‌వాటిని పరిష్కారిస్తామన్నారు. వారం‌ క్రితం మున్సిపల్ అధికారులతో సమీక్ష చేశానని మంత్రి నారాయణ తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com