హిందూపురం నుంచి పోటీ చేసిన ప్రతిసారి వరుసగా ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో హిందూపురం నుంచి పోటీ చేసిన బాలకృష్ణ బంపర్ మెజార్టీతో విజయం సాధించారు. బాలకృష్ణ 2014,2019,2024 వరుస ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు . ఈసారి పార్టీ కూడా అధికారంలోకి రావడంతో బాలకృష్ణకు మంత్రి పదవి ఖాయమని అనుకున్నారంతా. అయితే సామాజిక సమీకరణాలు అడ్డు రావడంతో పాటు, టీడీపీతో కూడా బీజేపీ, జనసేన పార్టీలతో కలిసి అధికారం పంచుకోవాల్సి రావడంతో, బాలకృష్ణకు మంత్రి పదవి దక్కలేదు.దీని కారణంగానే ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం బాలకృష్ణ అసెంబ్లీ నుంచి అలిగి వెళ్లిపోయారనే వాదన తెర మీదకు వచ్చింది. అయితే తాజాగా ఆయన సన్నిహితులు అలాంటిది ఏమీ లేదని క్లారిటీ ఇచ్చారు.