ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సినీ ఫక్కీలో వైసీపీ నేతపై హత్యాయత్నానికి పాల్పడిన టీడీపీ కార్యకర్తలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 24, 2024, 12:55 PM

పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలం క్రోసూరు మార్కెట్‌ యార్డు చైర్మన్‌ ఈదా సాంబిరెడ్డి (70)పై మంగళవారం సినీ ఫక్కీలో హత్యాయత్నం జరిగింది. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు ఆయనను గుంటూరులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. కాగా, ఘటన జరిగిన సమయంలో పల్నాడు జిల్లా ఎస్పీ కె. శ్రీని­వాసరావు క్రోసూరులోనే ఉండటం గమనార్హం. సాంబి­రెడ్డికి వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా కార్యదర్శిగా, మార్కెట్‌ యార్డు చైర్మ­న్‌గా, ఎంపీపీగా, సర్పంచ్‌గా ప్రజల్లో మంచి పేరు ఉంది. ఎన్ని­కలు ముగిసిన నాటి నుంచి ఆయన తన స్వగ్రామం పెద­కూర­పాడు మండలం 75 త్యాళ్ళూరులో ఉంటున్నారు. మాజీ ఎమ్మెల్యే, వైయ‌స్ఆర్‌సీపీ పెదకూరపాడు ఇన్‌చార్జి నంబూరు శంకరరావు మంగళవారం గుంటూరులోని తన కార్యాల­యా­నికి వచ్చినట్లు తెలియడంతో సాంబిరెడ్డి.. తన ఇద్దరు అనుచ­రులు కీసర గంగాధరరెడ్డి, కల్లి శ్రీనివాసరెడ్డి, కారు డ్రైవర్‌ దామోదరరెడ్డితో వెళ్లి ఆయనను కలిశారు. తిరిగి వస్తుండగా అమరావతి మండలం ఉంగుటూరు, పెదకూర­పాడు మండ­లం కంభంపాడు మధ్య సాంబిరెడ్డి ప్రయాణి­స్తున్న కారుపై కొందరు దుండగులు మాటు వేసి మూకుమ్మ­డిగా దాడి చేశారు. ఆంజనేయ స్వామి దేవాలయం రోడ్డులో రెండు కారు­ల్లో మాటు వేసిన దుండగులు సాంబిరెడ్డి ప్రయాణిస్తున్న కారు­కు ఇంకో కారును అడ్డుపెట్టి ఆయన కారు అద్దాలు పగలగొ­ట్టారు. ఈ క్రమంలో శ్రీనివాసరెడ్డి, దామోద­ర్‌­రెడ్డి, గంగాధర­రెడ్డికి గాయాల­య్యాయి. సాంబిరెడ్డిని బయటకు లాగి పక్కకు తీసుకెళ్లి చేతులు మెలవేసి.. కాళ్లను లక్ష్యంగా చేసుకుని విచక్ష­ణారహితంగా పది మంది దాడి చేశారు. ఈ దాడిలో ఆయన కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం మృతి చెందారని భావించి వదిలివెళ్లిపోయారు. ఎన్నికల సమ­యంలో మా అక్క (టీడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్‌ భార్య లావణ్య) కారునే అడ్డు­కు­ంటారా అంటూ దాడి చేసినట్లు బాధి­తులు తెలిపారు. కాగా, ఘటనాస్థలిని ఎస్పీ శ్రీనివాస­రావు పరిశీలించారు. క్లూస్‌ టీం, డాగ్‌ స్క్వాడ్‌లను రప్పించి వివ­రాలు సేకరిస్తామన్నారు. నిందితులను పట్టుకోవడానికి ఐదు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com