ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి ఆలయాలలో విశేష పూజలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 09, 2024, 11:09 AM

రాజాం నియోజకవర్గంలోని పలు శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి ఆలయాలలో స్వామివారికి మంగళవారం విశేష పూజలు జరిగాయి. ఆయా దేవాలయాల అర్చకులు స్వామివారిని అష్టోత్తర శతనామావళితో పూజలను నిర్వహించారు. స్వామివారి మెడలో తమలపాకుల దండలు మరియు నిమ్మకాయల దండలను అలంకరించి గంధసిందూరంతో పూజలు చేశారు. స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తుల గోత్రనామాలతో పూజలు చేసిన అనంతరం తీర్థప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com