బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా మన ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నెల్లూరు వేదయపాలెం లో ఉన్న ఆయన విగ్రహానికి శనివారం పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మన ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పల్లాల శ్రీనివాసులు మాట్లాడుతూ దళితుల ఆరాధ్య దైవం జగ్జీవన్ రాం అని కొనియాడారు. ఎమ్మార్పీఎస్ యూత్ జిల్లా అధ్యక్షులు వనం కుమార్, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పల్లాల సునీతా, రాజా, తేజ పాల్గొన్నారు.