అనకాపల్లి జిల్లా నూతన కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన కే విజయ కృష్ణ ణ్ శనివారం మధ్యాహ్నం రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనితను మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన విజయ్ కృష్ణ ణ్ , నక్కపల్లి కి సమీపంలో ఉన్నటువంటి హోంమంత్రి అనిత నివాసానికి వచ్చారు. హోంమంత్రి అనితను కలిసి పూల మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా అభివృద్ధికి అంకితభావంతో పనిచేద్దామని ఇరువురు చర్చించుకున్నారు.