మార్కెట్ అవసరాలకు అనుగుణంగా యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తామని రాష్ట్రమంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్పారు. నిరుద్యోగ యువతకు భారీ ఎత్తున ఉపాధి శిక్షణ కల్పించేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు ఆయన వెళ్లడించారు. వీటి అగ్రహారం మహిళా ప్రాంగణంలోని టిటిడిసి స్కిల్ కాలేజ్‌ను, ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మీతో కలిసి శనివారం మంత్రి సందర్శించారు.