ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ ఓఎస్డీగా కడప ఆర్డీవో.. ఇంతకీ ఎవరీ మధుసూదన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 05, 2024, 04:56 PM

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్సనల్ సెక్రటరీ (ఓఎస్డీ)గా యువ అధికారిని నియమించారు. ప్రస్తుతం కడప ఆర్డీవోగా పనిచేస్తున్న మధుసూదన్‌‌ ఓఎస్డీగా వస్తున్నారు. మధుసూదన్ కడపతో పాటు ధర్మవరం ఆర్డీవోగా బాధ్యతలు నిర్వహించారు. మధుసూదన్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.. తనను ఓఎస్డీగా నియమించినందుకు ధన్యవాదాలు తెలిపారు. కడపలో పనిచేస్తున్న మధుసూదన్‌ను ఏరికోరి ఓఎస్డీగా నియమించడం ఆసక్తికరంగా మారింది. అయితే మధుసూదన్ ఎన్నికల సమయంలో.. కడపలో పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు చర్యలు తీసుకున్నారట.. అందుకే ఆయన్ను ఓఎస్డీగా నియమించారనే చర్చ జరుగుతోంది.మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూర్యారాధన క్రతువులో పాల్గొన్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆరాధనను ఘనంగా నిర్వహించారు. పవన్‌ కళ్యాణ్‌ ప్రస్తుతం వారాహి ఏకాదశ దిన దీక్షలో ఉన్నారు. ఇందులో భాగంగా సూర్యారాధన చేశారు. దీశాబద్దులైన శ్రీ పవన్‌ కళ్యాణ్‌ గారు ఆదిత్య యంత్రం ఎదుట ఆశీనులై వేద పండితులు మంత్రోచ్చారణల నడుమ ప్రత్యక్ష భగవానుడిని ఆరాధించారు. వేద మంత్రోక్త సూర్య నమస్కార ప్రకరణంగావించారు. పవన్ కళ్యాణ్ ఇటీవల వెన్ను సంబంధిత సమస్య తలెత్తాయి.. దీంతో నిత్యం సూర్య నమస్కారాలను చేయలేకపోయారు. అందుకు బదులుగా మంత్రసహిత సూర్య ఆరాధనను చేశారు.


దేశ సౌభాగ్యాన్ని, సమాజ క్షేమాన్ని కాంక్షిస్తూ పవన్ కళ్యాణ్ ఈ క్రతువును ఆచరించినట్లు జనసేన పార్టీ తెలిపింది. ఈ అద్భుతమైన సూర్యారాధన విశిష్టతను వేదపండితులు కోసిగంటి సుధీర్‌ శర్మ, హరనాథ శర్మ, వేణుగోపాలశర్మ వివరించారు. సమాజ వికాసం,


సాభాగ్యం ఆకాంక్షిస్తూ సూర్యారాధన చేయాలి అన్నారు. ప్రజల జీవన విధానంలో భాగమే సూర్య నమస్కారాలు.. పురాణేతిహాసాల్లో సూర్యారాధన ప్రస్తావన ఉందని తెలిపారు. వనవాసంలో ధర్మరాజు ప్రత్యక్ష భగవానుడిని ప్రార్ధించి అక్షయ పాత్ర పొందారు అని మహా భారతం చెబుతోందన్నారు. బ్రిటిష్‌ పాలకుల ప్రభావంతో ఆదివారం అంటే సెలవు దినంగా మారిపోయిందని.. కానీ మన సంస్కృతిలో ఆదివారానికి విశిష్టత ఉందన్నారు. రవి వారం అని పిలిచే ఆ రోజు సూర్యుడిని ఆరాధించి పనులకు శ్రీకారం చుట్టేవారని.. అందుకే ఆదివారాన్ని కృషి వారం అని కూడా అంటారన్నారు.


మరోవైపు జనసేన పార్టీకి హరిప్రసాద్‌ పవన్ కళ్యాణ్‌ను కలిశారు. తనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. హరిప్రసాద్ పార్టీకి అందించిన సేవలు విలువైనవి.. నిస్వార్థమైనవని పవన్ కళ్యాణ్ ప్రశంసించారు. హరిప్రసాద్‌కు శాసనమండలిలో ప్రజా సమస్యలు, రాష్ట్రాభివృద్ధిపై బలంగా చర్చించే అవగాహన ఉందన్నారు. హరిప్రసాద్‌‌కు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవికి జనసేన పార్టీ తరఫున అవకాశం దక్కిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ మూడు రోజుల పాటూ పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించిన సంగతి తెలిసిందే.. అక్కడ అధికారులతో కీలక సమీక్షలు నిర్వహించారు. అక్కడ జరిగిన బహిరంగ సభలో కూడా పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com