జులై నెల 1వ తేదీన గ్రామ సచివాలయ ఉద్యోగులచే పింఛన్ల పంపిణీ చేపట్టడం జరుగుతుందని మండల అభివృద్ధి అధికారి జాషువా అన్నారు. ఎర్రగుంట్ల మండల పరిషత్ కార్యాలయ సభ భవనంలో శుక్రవారం సచివాలయ ఉద్యోగులకు పింఛన్ల పంపిణీపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ. జులై 1న ఉదయం 6 గంటల నుంచి పింఛన్ల పంపిణీ మొదలు పెట్టాలని సూచించారు. తహశీల్దార్ సౌజన్య లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.