ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మోడీపై చంద్రబాబు ప్రశంసల జల్లు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 07, 2024, 03:55 PM

నరేంద్ర మోదీ నాయకత్వంపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రశంసల జల్లు కురిపించారు. భారత్‌కు సరైన సమయంలో సరైన నాయకుడు దొరికారని, ఆయన నరేంద్ర మోదీ అని చంద్రబాబు పొగిడారు. నరేంద్ర మోదీకి విజన్, ఉత్సాహం ఉన్నాయని, పరిపూర్ణ కార్యదక్షత కలిగిన నాయకుడని అన్నారు. తన విధానాలన్నింటినీ నిజమైన స్ఫూర్తితో అమలు చేస్తున్నారని అన్నారు. ప్రస్తుతం భారత్‌కు చాలా మంచి అవకాశమని, ఇప్పుడు మిస్ అయితే ఎప్పటికీ నష్టపోతామని చంద్రబాబు వ్యాఖ్యానించారు.మోదీ విజన్‌, సమర్థత దేశానికి ఎంతో అవసరని ఈ సందర్భంగా చంద్రబాబు వ్యాఖ్యానించారు. దేశానికి మోదీ ఎన్నో అద్భుత విజయాలు అందించారని, దేశంలో యువశక్తి ఐటీ రంగంలో దూసుకుపోతోందని ప్రస్తావించారు. ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థకు మోదీ నాయకత్వం వహిస్తున్నారని, ఏం సాధించాలన్నా ఒక విజన్‌ ఉండాలని, మోదీ విజన్‌ ఉన్న నాయకుడని చంద్రబాబు మెచ్చుకున్నారు. ఇక లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన నూతన ఎంపీలు అందరినీ ఆయన అభినందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com