ఏపీలో వైసీపీ పరాజయం తర్వాత.. ఓడిపోయిన ఆ పార్టీ అభ్యర్థులు ఒక్కొక్కరు మీడియా ముందుకు వస్తున్నారు. తాజాగా మాజీమంత్రి బొత్స సత్యనారాయణ వైసీపీ ఓటమిపై స్పందించారు. ప్రజాతీర్పును గౌరవిస్తున్నామని తెలిపారు. ఇదే సమయంలో వైసీపీ ఓటమికి పార్టీ విధానాలే కారణమని ఒప్పుకున్నారు. ఓటమికి పార్టీలో ఏ ఒక్కరినో నిందించలేమని.. పార్టీ విధానాలే కారణమన్నారు. మా పార్టీ కంటే కూటమి మెరుగైన పాలన అందిస్తుందని ప్రజలు ఆశించారని.. అందుకే టీడీపీ కూటమిని గెలిపించారని చెప్పారు. పార్టీని మరింతగా క్షేత్రస్థాయిలో బలోపేతం చేసుకునేందుకు ఓ స్పష్టమైన విధానాన్ని ప్రకటిస్తామని తెలిపారు. ఎన్నికల సమయంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రకటించిన మేనిఫెస్టో అమలు కావాలని కోరుకుంటున్నామన్నారు.