ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రబాబు మరో మాస్టర్ ప్లాన్.. ముందుగానే అలర్ట్, ఈసారి ఆ తప్పు జరగకుండా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 25, 2024, 07:45 PM

తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల్లో సీట్లు దక్కని నేతలకు జిల్లా, లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల సమన్వయకర్తలుగా నియమించారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటన విడుదల చేశారు. వీరిలో ఇద్దరిని జిల్లా, ఐదుగురిని లోక్‌సభ, 14 మందిని అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలుగా నియమించారు.


టీడీపీ శ్రీకాకుళం పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడిగా కలమట వెంకటరమణను నియమించారు. నారా చంద్రబాబునాయుడి ఆదేశాల మేరకు కలమటను నియమించినట్లు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. తనకు కీలక బాధ్యతలు అప్పగించిన చంద్రబాబు, అచ్చెన్నాయుడికి కృతజ్ఞతలు తెలిపారు. రెండు రోజుల్లో బాధ్యతలు స్వీకరిస్తానని, పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని చెప్పారు. అలాగే అనంతపురం లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడిగా అధ్యక్షుడిగా జి.వెంకట శివుడు యాదవ్‌ నియమించారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. తన సేవలను గుర్తించి తెదేపా చంద్రబాబు, నారా లోకేష్, అచ్చెన్నాయుడుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు వెంకట శివుడు. సహకరించిన మాజీ మంత్రులు కాలవ శ్రీనివాసులు, పరిటాల సునీత, ఇతర జిల్లా నాయకులకు అభినందనలు తెలిపారు.


అలాగే బాపట్ల లోక్‌సభ నియోజకవర్గానికి బాచిన చెంచు గరటయ్య, గుంటూరు- తమ్మిశెట్టి జానకీదేవి, జగ్గయ్యపేట -కేవీవీ సత్యనారాయణ, నందిగామ- జంపాల సీతారామయ్య, పెనమలూరు- గన్నే వెంకట నారాయణ ప్రసాద్‌, పామర్రు- గొట్టిపాటి రామకృష్ణప్రసాద్‌, విజయవాడ తూర్పు- బొప్పన భవకుమార్‌, విజయవాడ సెంట్రల్‌ - చెన్నుపాటి శ్రీనివాస్‌, విజయవాడ పశ్చిమం - కోనేరు శ్రీధర్‌, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఎన్నికల సమన్వయకర్తగా సానా సతీష్‌, ఉమ్మడి కృష్ణా జిల్లాకు డాక్టర్‌ దోనేపూడి పవన్‌, విజయనగరం- కొండపల్లి అప్పలనాయుడు, నరసరావుపేట- జంగా కృష్ణమూర్తి, కాకినాడ- తోట నవీన్‌, జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా ఎస్‌వీఎస్‌ అప్పలరాజు, పెద్దాపురం- సూరిబాబు రాజు, ప్రత్తిపాడు -సూర్యనారాయణరాజు, కాకినాడ గ్రామీణం- నులుకుర్తి వెంకటేశ్వరరావు, కాకినాడ పట్టణం- వనమాడి ఉమాశంకర్‌, తుని -సుర్ల లోవరాజు, విశాఖ ఉత్తరం- మహమ్మద్‌ నజీర్‌‌లను నియమించారు. అంతేకాదు రాష్ట్రంలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు టీడీపీ ఇంఛార్జ్‌లుగా నియమించింది. పాలకొండ నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా పడాల భూదేవి, విశాఖ దక్షిణానికి సీతంరాజు, పెందుర్తికి గండి బాబ్జిని నియమించినట్లు ప్రకటించింది.


టికెట్ ఆశించి దక్కని నేతలు, ఇటీవల వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలో చేరిన వారికి ప్రాధాన్యం ఇచ్చారు. స్థానికంగా అభ్యర్థులతో సమన్వయం చేసుకుని.. ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే సరిచేసుకునేలా నేతలకు బాధ్యతల్ని అప్పగించింది టీడీపీ. కొత్తగా నియమించిన నేతలు ఆయా నియోజకవర్గాల్లో పరిస్థితులపై ఎప్పటికప్పుడు అధిష్టానానికి కూడా నివేదికలు అందజేయనున్నారు. మొత్తానికి చంద్రబాబు ఈసారి ఎన్నికల్లో ఎలాంటి తప్ప జరగకుండా ముందుగానే చర్యలు ప్రారంభించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com