ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగన్‌ విజన్‌.. ట్రాన్స్‌ఫార్మింగ్‌ ది ఫ్యూచర్‌ ఆఫ్‌ ఏపీ పేరుతో పుస్తకం విడుదల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 25, 2024, 03:49 PM

సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలన టీడీపీ అభిమానులనూ ఆకట్టుకుంటోంది. గతంలో తెలుగుదేశం పార్టీకి, చంద్ర­బాబుకు అభిమాని అయిన సీనియర్‌ జర్నలిస్ట్‌ రేణుక పోతినేని ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ దార్శనిక పాలనపై ప్రత్యేకంగా ఓ పుస్తకం రూపొందించారు. ‘జగన్‌ విజన్‌.. ట్రాన్స్‌ఫార్మింగ్‌ ది ఫ్యూచర్‌ ఆఫ్‌ ఏపీ’ శీర్షికతో ఆమె రచించిన ఈ పుస్తకం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ట్రెండ్‌ అవుతోంది. సీఎం జగన్‌ నాయకత్వంలో ఏపీలో కనిపిస్తున్న అద్వితీయ మార్పులను ఎలు­గెత్తి చాటుతూ, మాజీ సీఎం చంద్రబాబు హయాంలోని అవినీతి కోణాలను ఈ పుస్తకం తూర్పారపట్టింది. ఏపీలో అభివృద్ధి, ఉద్యోగా­లు, సామాజిక న్యాయం, పారిశ్రామిక ప్రగతి, వ్యవ­సాయం, విద్య, ఆక్వా రంగం అభివృద్ధి, వైద్యం, సంక్షేమం, భూ సంస్కరణలు, ఇళ్ల నిర్మాణం, మేనిఫెస్టో విశ్వసనీయత, సీఎం జగన్‌ స్కీములు, చంద్రబాబు స్కాములను వివరిస్తూ, అప్పటి.. ఇప్పటి అప్పులపై ఎల్లో మీడియా చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేలా సమగ్ర వివరాలు అందించిన ఈ పుస్తకం అందరినీ ఆకట్టుకుంటోంది. సీఎం జగన్‌ సమగ్ర పాలనా స్వరూపాన్ని ఆవిష్కరించింది. ఒకప్పుడు చంద్రబాబు అభిమాని అయిన రేణుక పోతినేని.. ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న విప్లవాత్మక అభివృద్ధి, జీవన ప్రమాణాలను పెంచుతున్న ప్రజా సంక్షేమ పథకాలను చూసి ఈ పుస్తకాన్ని రూపొందించడమే కాకుండా, సీఎం జగన్‌ పాలనను సామాజిక మాధ్యమాల్లో ప్రశంసిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com