నిర్వహణ లోపించిన ఏపీఎస్ ఆర్టీసీ బస్సు మరో ప్రమాదం బారిన పడింది. స్టీరింగ్ పట్టేయడంతో శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి వద్ద హిందూపురం డిపో ఆర్టీసీ బస్సు బోల్తా పడి..ఆరుగురు గాయపడ్డారు. బుధవారం అనంతపురం నుంచి హిందూపురానికి బయలుదేరిన బస్సు.. మామిళ్లపల్లి వద్ద ప్రయాణికులను ఎక్కించుకుని, హైవే ఎక్కుతున్న సమయంలో బస్సు స్టీరింగ్ పనిచేయలేదు. దీంతో అదుపుతప్పి పక్కనున్న గుంతలోకి దూసుకెళ్లి బోల్తాపడింది. ఆ సమయంలో బస్సులో 33 మంది ప్రయాణికులు ఉండగా, డ్రైవర్ ఇనాయతుల్లా సహా ఆరుగురు గాయపడ్డారు.