కురబలకోట మండలంలో ఓ రైతు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు ప్రయత్నించారు. ముదివేడు పోలీసుల వివరాల మేరకు. మండలంలోని జంగావారిపల్లెకు చెందిన రైతు నరసింహులు ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తాళలేక మనస్తాపానికి గురయ్యాడు. మద్యంలో విషం కలుపుకొని తాగాడు. కుటుంబీకులు గమనించి మంగళవారం బాధితుడిని చికిత్స కోసం మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. అత్యవసర విభాగంలో రైతు వైద్యం పొందుతున్నాడు.