ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తిలో నేడు ( బుధవారం )సత్య సాయి బాబా ఆరాధన వేడుకలు జరగనున్నాయి. సత్య సాయిబాబా శివైక్యం చెంది 13 సంవత్సరాల అవుతున్న సందర్భంగా ప్రశాంతి నిలయంలో ఆరాధన వేడుకలు నిర్వహించనున్నారు. ప్రశాంతి నిలయంలో వేడుకలు ముగిసిన అనంతరం సత్యసాయి హిల్ స్టేడియంలో నారాయణ సేవ జరగనుంది.ఈ సందర్భంగా పేదలకు అన్న, వస్త్రధానాలు చేయనున్నారు.