ఇండియా కూటమి బలపరుస్తున్న హిందూపురం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఇనాయతుల్ల మంగళవారం విద్యార్థి సంఘాల నాయకులు ఆయన స్వగ్రామంలో అభినందనలు తెలిపారు. హిందూపురంలో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు తమ శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బాబావలి, ఏఐఎస్ఎఫ్ నాయకులు చంద్రశేఖర్ తదితర విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.