ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం ఉప్ప ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పుష్పలత (36) అనే మహిళకు 4.5 కేజీల మగబిడ్డ జన్మించాడు. ఇది ఆమెకు మూడవ కాన్పు. ఆపరేషన్ లేకుండా బిడ్డ జన్మించినట్లు ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్లు పేర్కొన్నారు. సాధారణంగా పుట్టిన బిడ్డల బరువు 2.5 నుంచి 3 కిలోల మధ్య ఉంటుంది. కానీ ఈ బిడ్డ బరువు 4.55 కేజీలు ఉండటం అందర్ని ఆశ్చర్యానికి గురి చేసింది.