వెలంపల్లి శ్రీనివాస్‌లో ఓటమి భయం ఉందని, దీంతో సానుభూతితో గెలవాలని గులకరాయి డ్రామాలు ఆడుతున్నాడని సెంట్రల్ టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అభ్యర్థి బొండా ఉమామహేశ్వరరావు విమర్శించారు. అజిత్‌సింగ్‌నగర్‌లోని సెంట్రల్ టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.... తెలుగు రాష్ట్రాల్లోనే ప్రఖ్యాతి గాంచిన ఎల్వీప్రసాద్ ఐ ఆస్పత్రిలో వెలంపల్లి కంటికి వైద్య పరీక్షలు చేయించి నిజనిర్ధారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వెలంపల్లి చెప్పింది అబద్ధమని రుజువైతే తగిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. వెలంపల్లి డ్రామాలను ప్రజలు గమని స్తున్నా రన్నారు. జరగని దాడిని జరిగినట్లు ప్రజలను నమ్మించి డ్రామాలాడిన వెలంపల్లి నామినేషన్‌ను తక్షణమే ఎన్నికల సంఘం తిరస్కరించాలని ఓట ర్లను తప్పుదారి పట్టిస్తున్న వెలంపల్లిపై సెంట్రల్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులు కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. గులకరాయి దాడి ఘటనలో నిజాలు బయటకు రావాలనే ఎన్నికల సంఘానికి, గవర్నర్‌కు ఫిర్యాదు చేశామని వివరించారు.