ప్రకాశం జిల్లా పొదిలి మండలంలో ఓబులక్క పల్లి గ్రామంలో మంగళవారం మార్కాపురం వైఎస్ఆర్సిపి అభ్యర్థి అన్న వెంకట రాంబాబు ఏపీఐఐసీ చైర్మన్ జంకె వెంకట రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికీ గ్రామ ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. ప్రచార కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి భాస్కర్ రెడ్డికి వైఎస్ఆర్సిపి అభ్యర్థి వెంకట రాంబాబుకి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వేయించి గెలిపించాలని జంకె వెంకటరెడ్డి కోరారు.