పర్చూరు టిడిపి అభ్యర్థి, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు నామినేషన్ మహోత్సవం సోమవారం అంచనాలకు మించి జయప్రదం కావడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. జనాల రద్దీ కారణంగా ఏలూరి నామినేషన్ దాఖలుకు తహసీల్దార్ ఆఫీస్ కు వెళ్లలేకపోవడాన్ని బట్టి ఈ కార్యక్రమం ఎంత విజయవంతమైందో ఊహించుకోవచ్చు. పర్చూరు చరిత్రలోనే ఇంత భారీ ర్యాలీ గతంలో ఎన్నడూ జరగలేదని, ఏలూరి విజయం ఫిక్స్ అయిందని పరిశీలకులు చెబుతున్నారు.