చీమకుర్తి పట్టణంలోని ప్రభుత్వ మద్యం దుకాణాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మద్యం షాపులోని మద్యం నిల్వలు, స్టాక్ ను పరిశీలించారు. మద్యం విక్రయాల్లో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలుతీసుకుంటామని జాయింట్ కలెక్టర్ హెచ్చరించారు. మద్యం విక్రయించే సిబ్బంది తప్పనిసరిగా రిజిస్టర్ లో నమోదు చేయాలని జేసీ సిబ్బందిని ఆదేశించారు.