చంద్రబాబూ.. నిన్ను సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను..? బీజేపీతో నేను ఎన్నటికీ పొత్తు పెట్టుకోనన్నావు. ఒకసారి మాట తప్పి పొత్తు పెట్టుకున్నావు. ఆ తర్వాత నరేంద్రమోదీ మోసం చేశాడన్నావు. అనవసరంగా పొత్తు పెట్టుకున్నాను.. ఇక ఎప్పటికీ పొత్తు పెట్టుకోనని నమ్మబలికావు. ఇప్పుడు ఎన్నికలు రాగానే మళ్ళీ అదే బీజేపీతో నువ్వు పొత్తు పెట్టుకున్నావు. ఇదంతా నిజంకాదా..? అంటే, నీ అవసరాలను బట్టి రంగులు మార్చుకుంటావా..? నీకంటూ ఒక స్టాండ్ ఉండదా..? ఈరోజు నీ స్వార్థప్రయోజనాలకు ఎలాంటి స్టాండైనా తీసుకుంటావని.. నీ రంగులు మార్చే ఊసరవెల్లి నైజం ప్రతీ ఒక్కరికీ అర్ధమైంది అని కర్నూలు ఎమ్మెల్యే మహ్మద్ అబ్దుల్ హఫీజ్‌ఖాన్ ప్రశ్నించారు.