ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ రెండు స్థానాలపై కొనసాగుతున్న కసరత్తు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 29, 2024, 10:40 AM

 జనసేన పోటీ చేయనున్న 21 అసెంబ్లీ స్థానాల్లో 19 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. పాలకొండ, అవనిగడ్డ అభ్యర్థులపై ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ కసరత్తు సాగుతోంది. పిఠాపురం పర్యటనకు ముందే వాటి అభ్యర్థులను ప్రకటించాలని భావించారు. కానీ ఆ రెండు స్థానాలకు పోటీపడుతున్న ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ప్రకటన కొంత ఆలస్యం అయ్యేలా కనిపిస్తుంది. పాలకొండకు ఆరుగురు పోటీ పడుతున్నారు. పార్టీలో కొంత మంది నాయకులు ఆ సీటు ఇప్పిస్తామని కొంత మందిని వెంట పెట్టుకుని పార్టీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. ఇలా ఎవరికి వారు పవన్‌ కల్యాణ్‌ను కలిసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ వైసీపీ నుంచి విశ్వాసరాయి కళావతి పోటీ చేస్తున్నారు. జనసేన తరఫునా మహిళనే బరిలోకి దించే ఆలోచనలో జనసేన నాయకత్వం ఉంది. అవనిగడ్డ సీటు కోసం విక్కుర్తి శ్రీనివాస్‌, బండి రామకృష్ణ, బండ్రెడ్డి రామకృష్ణ పోటీ పడుతున్నారు. వీరిలో ఐవీఆర్‌ఎస్‌ సర్వేలో విక్కుర్తికే మొగ్గు ఉన్నట్లు తేలింది. ఈ రెండు సీట్లకూ అభ్యర్థులపై పవన్‌ పిఠాపురం పర్యటన తర్వాత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మచిలీపట్నం లోక్‌సభ సీటు విషయంలో కూడా కొంత గందరగోళం నెలకొంది. వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరిన ఎంపీ వల్లభనేని బాలశౌరి ఇక్కడి నుంచి పోటీ చేసే అంశంపై సృష్టత ఇవ్వలేదు. ఆయన పోటీ నుంచి వైదొలిగితే గ్రీన్‌కో డైరెక్టర్‌ బండారు నరసింహారావు బరిలో నిలిచే అవకాశముంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com