ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పరిటాల శ్రీరామ్ కు షాక్ ఇచ్చిన చంద్రబాబు

national |  Suryaa Desk  | Published : Fri, Mar 29, 2024, 08:51 AM

ఏపీలో సీట్లు దగ్గర గానే పొత్తు కుదిరింది. టీడీపీ, జనసేన పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించగా.. బీజేపీ నుంచి ఒక్క పేరు కూడా లేదు. కొన్ని నియోజకవర్గాల్లో నేతల మధ్య పోరు ఎక్కువ కావడంతో టికెట్ ఎవరికి దక్కుతుందోనన్న ఉత్కంఠ అన్ని పార్టీల నేతల్లో కనిపించింది. ఈ ఉత్కంఠకు తెరదించుతూ తమకు కేటాయించిన 10 ఎమ్మెల్యే స్థానాలకు అభ్యర్థులను బీజేపీ అధిష్టానం బుధవారం సాయంత్రం ప్రకటించింది.
బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థులు
ఎచ్చెర్ల - ఎన్ ఈశ్వరరావు
విశాఖపట్నం నార్త్ - విష్ణు కుమార్ రాజు
అరకులోయ - పాంగి రాజారావు
అనపర్తి - ఎం.శివ కృష్ణం రాజు
కైకలూరు - కామినేని శ్రీనివాసరావు
విజయవాడ వెస్ట్ - సుజనా చౌదరి
బద్వేల్ - బొజ్జా రోసన్న
జమ్మలమడుగు - ఆదినారాయణ రెడ్డి
ఆదోని - పార్థసారథి
ధర్మవరం - వై.సత్యకుమార్
ఇదిలా ఉండగా ధర్మవరం టికెట్ ఆశించిన పరిటాల శ్రీరామ్ కు మొండి చేయి ఎదురైంది. పరిటాల శ్రీరామ్‌ బంధువులు టికెట్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com