ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీడీపీ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా రఘు రామ?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 28, 2024, 01:20 PM

టీడీపీ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా రఘురామ కృష్ణరాజు పేరును ప్రకటించనున్నారని టీడీపీ కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు. ఇదిలా ఉండగా బిజేపి, టీడీపీ, జనసేన పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి తానేనని ప్రకటించుకొని ఉత్తర నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు ఇప్పటికే జోరుగా ప్రచార కార్యక్రమాలు చేపట్టడంతో పాటుగా నిత్యం కార్యకర్తలతో సమీక్షలు నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలో నరసాపురం ఎంపి రఘు రామ కృష్ణ పేరు తెరపైకి రావడంతో విష్ణు కుమార్ రాజు ఇప్పటికే విజయవాడ వెళ్ళి పార్టీ పెద్దలతో మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. ఏదేమైనా ఉత్తర నియోజక వర్గంలో గట్టి పోటీ నెలకుంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com