ట్రెండింగ్
Epaper    English    தமிழ்

143 వాగ్దానాలు ఇచ్చి ఒక్కటి కూడా చంద్రబాబు అమలుచెయ్యలేదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 06, 2024, 12:47 PM

బీసీ డిక్లరేషన్ అంటూ మాయగాళ్ళ మరో వేషం వేసుకున్నార‌ని మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ,  జోగి రమేష్ మండిప‌డ్డారు.  బీసీ డిక్లరేషన్ అంటూ చంద్రబాబు, పవన్ కల్యాణ్ అనే ఇద్దరు అబద్ధాల వీరులు చేసిన ప్రకటన- పోస్టర్ లో వారు ఒక నినాదం రాశారు. బీసీలంటే బ్యాక్ వర్డ్ క్లాసులు కాదు-బ్యాక్ బోన్ క్లాసులు అని. ఈ నినాదం కూడా కాపీనే అన్నారు. బీసీ డిక్ల‌రేష‌న్ పేరుతో చంద్ర‌బాబు, ప‌వ‌న్ చేస్తున్న మోసాన్ని మంత్రులు ఎండ‌గ‌ట్టారు. ఈ మేర‌కు ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. మొట్టమొదటిసారిగా బీసీ అనే పదానికి సరైన నిర్వచనం చెబుతూ వెనుకబడిన కులాలు కాదు వెన్నెముక కులాలు, బ్యాక్ వర్డ్ క్లాసులు కాదు- బ్యాక్ బోన్ క్లాసులు... అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల ముందు ఏలూరు డిక్లరేషన్ లో చెప్పిన మాటల్ని కూడా బాబు-పవన్ కల్యాణ్ కాపీ కొట్టారు.  2014 ఎన్నికల సందర్భంగా బీసీలకు టీడీపీ ఇచ్చిన హామీలెన్నో బీసీలూ మరచిపోలేదు, రాష్ట్ర ప్రజలూ మరచిపోలేదు. ఆ వాగ్దానాల సంఖ్య 143. అందులో అమలు చేసింది సున్నా. 143 వాగ్దానాలు ఇచ్చి ఒక్కటి కూడా అమలు చేయని చంద్రబాబు ఇప్పుడు 50 ఏళ్ళకే పెన్షన్ అన్నా, బీసీ సబ్ ప్లాన్ ద్వారా 5 ఏళ్ళలో లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తామన్నా, చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్నా, తాము ఆదరణ లాంటి 30 పథకాలు అమలు చేశాం అని చెప్పినా, బీసీ భవనాలు, కమ్యూనిటీహాళ్ళు ఏడాదిలో పూర్తి చేస్తామన్నా... ఇందులో ఏ ఒక్క వాగ్దానాన్ని, ఏ ఒక్క బీసీ కులాలవారూ నమ్మరు అని అన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com