ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 27, 2024, 01:53 PM

ప్రకాశం జిల్లా కొమరోలు మండలం దద్దవాడ గ్రామ సమీపంలో కారు-ద్విచక్ర వాహనం ఎదురెదురుగా ఢీకొన్న సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. ఈ సంఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. బేస్తవారిపేట మండలం పూసలపాడు గ్రామానికి చెందిన ఇరువురు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై గిద్దలూరుకు వెళ్తుండగా, కారు ఢీకొనడంతో ఇరువురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని 108 వాహనంలో గిద్దలూరు వైద్యశాలకు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com