ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేటి రాశిఫలాలు (27-02-2024)

Astrology |  Suryaa Desk  | Published : Tue, Feb 27, 2024, 11:06 AM

మేషం
కుటుంబ సభ్యుల నుండి అవసరానికి ధన సహాయం అందుతుంది. చిన్ననాటి మిత్రులతో గృహమును సంతోషంగా గడుపుతారు. వృత్తి ఉద్యోగాల్లో అధికారుల ఆదరణ పొందుతారు. వాహన సంభంధిత వ్యాపారాలు రాణిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఉత్సాహంగా సాగుతాయి.
వృషభం
సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. శుభకార్యలకు ధన వ్యయం చేస్తారు. కుటుంబ సభ్యులతో గృహమున సంతోషంగా గడుపుతారు. వృత్తి ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుంచి ఉపసమనం పొందుతారు.
మిథునం
సంతానం విద్యా ఉద్యోగ విషయాలలో దృష్టి సారించడం మంచిది. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు తప్పవు. కీలక వ్యవహారాలలో బద్దకించడం మంచిది కాదు. కుటుంబమున కొందరి ప్రవర్తన మానసికంగా బాధిస్తుంది.
కర్కాటకం
చేపట్టిన పనులు మధ్యలో నిలిచిపోతాయి. దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వృత్తి వ్యాపారాలలో నిదానంగా వ్యవహారించాలి. ఉద్యోగస్తులకు శ్రమాధిక్యత పెరుగుతుంది. దైవ చింతన పెరుగుతుంది మాతృ వర్గ బంధువులతో మాటపట్టింపులుంటాయి. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు.
సింహం
సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. దైవ కార్యక్రమాలలో ఆసక్తి పెరుగుతుంది. ఆదాయం మార్గాలు ఆశించిన విధంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు ఉన్నత అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు.
కన్య
చేపట్టిన పనులు కొంత మందకొడిగా సాగుతాయి. సోదరులతో కొన్ని విషయాలలో మాటపట్టింపులు ఉంటాయి. ధన పరంగా ఒడిదుడుకులు అధికమవుతాయి. వ్యాపారస్తులకు నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు పెరుగుతాయి.
తుల
నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. గృహంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు సమాకూరుతాయి. వృత్తి ఉద్యోగాలలో మీ విలువ పెరుగుతుంది. చిన్ననాటి మిత్రుల నుండి ధన సహయం అందుతుంది. స్ధిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు.
వృశ్చికం
వృథా ఖర్చులు పెరుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. వృత్తి వ్యాపారాలలో సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. ఉద్యోగమున ఇతరుల ప్రవర్తన వలన ఇబ్బందులు తప్పవు.
ధనస్సు
ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. నిరుద్యోగులకు అధికారుల అనుగ్రహం కలుగుతుంది. ధన వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. విలువైన గృహోప కరణాలు కొనుగోలు చేస్తారు. ఇంటా బయట వివాదాలు పరిష్కరించుకుంటారు.
మకరం
నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. సంఘంలో పెద్దలతో సఖ్యతగా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అన్ని వైపుల నుండి ఆదాయం అందుతుంది.
కుంభం
ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు పెరుగుతాయి. దూరపు బంధువుల నుండి ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. చేపట్టిన పనులలో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో వ్యయ ప్రయాసలతో కానీ పనులు పూర్తి కావు. వృథా ఖర్చుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది.
మీనం
గృహ నిర్మాణ పనులలో అవరోధాలుంటాయి. వాహన ప్రయాణ విషయంలో జాగ్రత్త వహించాలి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఉద్యోగాలలో స్థానచలన సూచనలు ఉన్నవి. నూతన రుణాలు చేయడం మంచిది కాదు. వ్యాపారస్థులకు గందరగోళ పరిస్థితులుంటాయి.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com