ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎండుద్రాక్షలు తినడం వల్ల ఎన్నో లాభాలు

Life style |  Suryaa Desk  | Published : Fri, Feb 16, 2024, 12:09 PM

ఎండుద్రాక్ష తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
- ఎండుద్రాక్ష వీర్యవృద్ధితో పాటు రక్తవృద్ధి చేస్తుంది.
- శరీరానికి, గుండెకు బలాన్నిస్తుంది. కంఠాన్ని శుభ్రపరిచి, దగ్గు తగ్గిస్తుంది.
- సాఫీగా విరేచనమయ్యేలా చేస్తుంది. క్షయవాధి నివారణకు ఉపకరిస్తుంది.
- ఎండిన ద్రాక్ష చర్మ సౌందర్యాన్ని పెంపొందిస్తుంది.
- గుప్పెడు కిస్మిస్ ను శుభ్రంగా కడిగి, ఒక గ్లాసు నీటిలో లేక పాలలో లేదా పెరుగులో వేసి రాత్రంతా నానబెట్టి, ఉదయం వాటిని బాగా మెత్తగా నలిపి తీసుకుంటే ఏ సంతులిత ఆహారానికీ తీసిపోని పౌష్టికత దీనిలో దొరుకుతుంది. ఇలా చేయడం వల్ల చర్మవ్యాధులు దరిచేరవు.
- కిస్మిస్ లో ఐరన్, కాల్షియం అధికంగా ఉన్నాయి. అందువలన ఇది రక్తవృద్ధి చేస్తుంది. ఎముకలకు దృఢత్వాన్ని కల్గిస్తుంది.
- స్త్రీలకు మధ్య వయసులో వచ్చే ఎముకల వ్యాధుల నివారణకు ఎండుద్రాక్ష అద్భుతంగా పనిచేస్తుoది. శరీరంలో సహజంగా రోగ నిరోధకశక్తిని పెంచుతుంది.
- అజీర్ణం, మలబద్దకం వంటి సమస్యల పరిష్కారానికి కిస్మిస్ కి మించింది లేదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com