ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరో మైలురాయికి చేరువలో ఇంగ్లండ్ కెప్టెన్

sports |  Suryaa Desk  | Published : Wed, Feb 14, 2024, 11:49 AM

ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మరో మైలురాయిని చెరనున్నారు. భారత్‍తో రాజ్‍కోట్‍లో ఫిబ్రవరి 15న జరిగే మూడో టెస్ట్ మ్యాచ్ తో తన 100 టెస్టులు పూర్తి చేసుకోనున్నారు. దీంతో ఈ ఘనత సాధించిన 16వ ఇంగ్లాండ్ ప్లేయర్ గా నిలవనున్నారు. ఓవరాల్ గా 76వ ప్లేయర్ కానున్నారు. ఇప్పటివరకు స్టోక్స్ 99 టెస్టుల్లో 6,251 పరుగులు చేశాడు. ఇందులో 13 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. దాంతో పాటు స్టోక్స్ 197 వికెట్లు తీశారు.
గురువారం రాజ్‌కోట్‌లో భారత్‌తో మొదలయ్యే మ్యాచ్‌ ఇంగ్లండ్ క్రికెటర్ బెన్ స్టోక్స్ కెరీర్‌లో వందో టెస్టు. ఇంగ్లండ్‌ తరఫున వంద టెస్టులు పూర్తి చేసుకోబోతున్న 16వ ఆటగాడు స్టోక్స్‌. ఇప్పటిదాకా 99 టెస్టులాడిన బెన్‌.. 6251 పరుగులు సాధించాడు. అలాగే 197 వికెట్లు పడగొట్టాడు. రాజ్‌కోట్‌ మ్యాచ్‌లో స్టోక్స్‌ 3 వికెట్లు పడగొడితే వందో టెస్టులో 200 వికెట్ల మైలురాయిని కూడా అందుకుంటాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com