ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అరబ్‌ నేతలతో బైడెన్‌ భేటీ రద్దు

international |  Suryaa Desk  | Published : Wed, Oct 18, 2023, 03:13 PM

గాజాలోని అల్‌ అహ్లి ఆసుపత్రిలో భారీ పేలుడు ఘటనపై తాను జోర్డాన్‌ రాజు అబ్దుల్లా 2, ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహుతో మాట్లాడినట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తెలిపారు. ఈ దాడి నేపథ్యంలో బైడెన్‌ జోర్డాన్‌ పర్యటన రద్దయ్యింది. జోర్డాన్‌లో ఆయన అబ్దుల్లాతో పాటు ఈజిప్టు ప్రధాని ఎల్‌-సిసీ, పాలస్తీనా అధ్యక్షుడు మహ్‌ముద్‌ అబ్బాస్‌ తదితరులతో భేటీ కావాల్సి ఉంది. ఈ సమావేశం రద్దయినట్లు జోర్డాన్‌ విదేశాంగ మంత్రి తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com