ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కోటాలో ఆగని మరణాలు.. మరొక విద్యార్థి ఆత్మ‌హ‌త్య

national |  Suryaa Desk  | Published : Tue, Sep 19, 2023, 10:12 AM

కోచింగ్‌ హబ్‌గా పేరొందిన రాజస్థాన్‌లోని కోటాలో తాజాగా మరొక విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. ఈ ఏడాదిలో ఇది 26వ బలవన్మరణం. కోటాలో వైద్య విద్య శిక్ష‌ణ తీసుకుంటున్న ప్రియాస్‌ సింగ్(యూపీ) సోమ‌వారం విషం తాగింది. అనంత‌రం ఆమెను ఆస్పిత్రికి తీసుకెళ్ల‌గా.. అక్క‌డ చికిత్స పొందుతూ మృతి చెందింది. బలవన్మరణానికి గల కారణాలు తెలియరాలేదు. కేసు నమోదు చేసిన పోలీసులు విచార‌ణ చేప‌ట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com