ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఏపీ సీఎం వై.ఎస్..జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలావుంటే మోడీ పుట్టినరోజు నేడు. ఈరోజు ఆయన 73వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీలకు అతీతంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి జగన్ కూడా మోదీకి ట్విట్టర్ (ఎక్స్) ద్వారా గ్రీటింగ్స్ తెలిపారు. 73వ పుట్టినరోజు సందర్భంగా గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి శుభాకాంక్షలు అని ట్వీట్ చేశారు.మరోవైపు మోదీ పుట్టినరోజును దేశ వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు ఘనంగా జరుపుకుంటున్నాయి. సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. మోదీ పేరిట ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయిస్తున్నారు.