ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రారంభమైన మృగశిర కార్తె.. ఇక ఎండలు తగ్గు ముఖం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jun 08, 2023, 04:24 PM

రోల్లును సైతం బద్దలు కొట్టే రోహిణి కార్తె కు వీడ్కోలు చెబుతూ చల్లదనాన్ని ప్రసాదించే మృగశిర కార్తెకు స్వాగతం పలుకుదాం. దీంతో శుక్రవారం నుంచి ఎండలు తగ్గుముఖం పట్టి చిరుజల్లులకు శ్రీకారం చుడుతూ వ్యవసాయ పనులకు అంకురార్పణ జరుగుతుందని చెప్పాలి. ఇక ఆరోగ్య విషయంలో ఈ కార్తెలు ప్రతి ఇంట్లో చేపలు తినడం ఆనవాయితీగా వస్తోంది. దీని వెనుక ఆరోగ్య రహస్యం దాగివుంది, రోళ్లు పగిలే ఎండలను మోసుకొచ్చిన రోహిణికార్తె ముగిసి చల్లబరిచే మృగశిర మొదలవుతుంది. మృగశిర కార్తె అంటే ఆశ్విని మొదలుకుని రేవతి వరకూ మనకున్న 27 నక్షత్రాల్లో సూర్యుడి ప్రవేశం ఆధారంగా కార్తె నిర్ణయం జరుగుతుంది. భారతీయ జ్యోతిష్య సాంప్రదాయం ప్రకారం. ఒక్కో కార్తెలో ఒక్కో విధంగాప్రకృతిలో మార్పులు జరుగుతుంటాయి.

ఈ క్రమంలో సూర్యుడు మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించిన నాటి నుంచి నైరుతి రుతుపనాలు వస్తాయి, వాతావరణం ఒక్కసారి చల్లబడటం, ప్రకృతిలో అనేక మార్పులు చోటు చేసుకునే నేపథ్యంలో అనేక రకాల చెడు సూక్ష్మీక్రిములు వంటివి పునురుత్పత్తి అవుతాయి. మానవునిలో రోగ నిరోధకశక్తి తగ్గి జ్వరం, దగ్గు, శ్వాస సంబంధ వ్యాధులు వస్తాయి, మృగశిర కార్తెలో చేపలు తినడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి కాపాడుకోవచ్చని, ఇది శాస్త్రీయంగా నిరూపించబడింది. చేపలు తినడం వల్ల ముఖ్యంగా గుండె జబ్బులు, ఆస్తమా, మధుమోహ వ్యాధి ఉన్నవారు, గర్భిణులు ఈ సమయంలో చేపలు తింటే ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఈ నేపథ్యంలో మనిషి శరీరంలో మార్పులు జరిగి వ్యాధుల బారిన పడే ప్రమాదముంది. గుండె జబ్బులు, ఆస్తమా తదితర ఆనారోగ్యసమస్యలు ఉత్పన్నమవుతాయి, వీటన్నింటికి అడ్డుకట్ట వేయాలంటే చేపలు తినాల్సిందే. పంచాగ ప్రకారం ఆరుద్ర నక్షత్రంలో సూర్యుడు ప్రవేశించే సమయంలోని తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు, శకునాలు తదితర అంశాల ఆధారంగా చేసుకుని ఆ సంవత్సరం యొక్క వర్షాన్ని నిర్ణయించడం జరుగుతుంది.

ఈ విధంగా వ్యవసాయదారులకు నిత్యజీవనోపయోగిగా, వ్యవసాయం పనులకు మార్గదర్శకంగా ఈ కార్తెలు ఉపయోగపడుతున్నాయి. పురాణగాధ ప్రకారం మృగశిరస్సు కలిగిన మృగవ్యాధుడు అను వృతాసురుడు వరప్రభావంచే పశువులను, పంటలను హరించి వేయడం ప్రకృతి భీభత్సాలాను సృష్టించడం, వర్షాలకు అడ్డుపడటం జరుగుతూ ఉండేడిది. ఇతను చనిపోకుండా అనేక వరాలు కలిగి ఉండటంచేత ఇంద్రుడు సముద్ర హలల నుండి వచ్చే నురుగును ఆయుధంగా చేసి చంపేస్తాడు. ప్రకృతి మార్పు ప్రభావం ఈ కథ ఆధారంగా ఖగోళంలో ఇంద్ర నక్షత్రమైన జ్యేష్టాకు మృగశిరకు 180 డిగ్రీల దూరంలో ఉండటం వలన తూర్పు ఆకాశంలో ఇంద్రనక్షత్రం ఉదయించగానే వృతాసురనక్షత్రం అస్తమిస్తుంటుంది. ఇక్కడ నురుగు అనేది ఋతు పవనాలకు, వర్షాలకు సూచన. ఇంద్ర నక్షత్రమైన జ్యేష్ట ఉదయించినపుడు సూర్యుడు మృగశిరలోకి ప్రవేశించడం వలన మృగశిరకార్తె ప్రవేశిస్తుంది. వర్షాలు పడకుండా అడ్డుపడ్డ మృగాసురుని చంపిన ఇంద్రున్ని వర్షప్రదాతగా, వర్షదేవుడుగా పిలుస్తారు. దీన్ని పూర్వీకులు కథలుగా చెబుతుంటారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com