పార్లమెంటు కొత్త భవనాన్ని శవపేటికతో పోల్చడంపై బీహార్ బీజేపీ నేత సుశీల్ మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత ప్రజాస్వామ్యానికి చిహ్నంగా అత్యాధునిక సాంకేతికతతో నిర్మించిన సరికొత్త పార్లమెంటు భవనాన్ని శవపేటికతో పోల్చిన వారిపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యం, దేశం అంటే గౌరవం లేనివారే ఇలాంటి మాటలు మాట్లాడతారని మండిపడ్డారు.