కుప్పం ద్రావిడ విశ్వవిద్యాలయ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు జీతాల కోసం రోడ్డెక్కారు. శుక్రవారం వర్శిటీ నాన్ టీచింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రధాన ద్వారం ఎదుట నిరవదిక సమ్మె చేపట్టారు. సుమారు 260 మందికి గత మూడు నెలలుగా జీతాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే యూనివర్సిటీ వీసీ, రిజిస్ట్రార్ లు స్పందించి ప్రభుత్వంతో మాట్లాడి తమకు రావాల్సిన జీతాలు ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నారు.