ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మనస్పర్ధలతో వివాహిత ఆత్మహత్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 27, 2023, 06:06 PM

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం ముమ్మిడివరప్పాడు గ్రామ వైసీపీ సర్పంచ్‌ వర్రే రేణుకాదేవి (41) భర్త లక్ష్మీనారాయణ మద్యానికి బానిసై ఆరోగ్యం పాడు చేసుకున్నాడు. మద్యం సేవించి తనను పట్టించుకోకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె బుధవారం తెల్లవారుజామున చీరతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఇంటిలోనే ఆత్మహత్య చేసుకుంది. ఆమె తండ్రి పెద్దింటి వీర్రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కొత్తపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ విప్‌, కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి నివాళులర్పించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com